చేతా మనుష్యుల చేతా పూజింప బడే సమస్త నాగరాజులకు నమస్కారము. తన కుమారుడైన అశ్వసేనుడితో కూడి భూలోకము అంతా సంచరించుచున్న తక్షకా!
నన్ను అనుగ్రహించు.” అని నాగుల నందరనూ పొగిడాడు ఉదంకుడు.
అప్పుడు అతనికి తెలుపు నలుపు దారాలతో వస్త్రములు నేయుచున్న ఇద్దరు స్త్రీలు, పన్నెండు ఆకులు గల చక్రమును తిప్పుతున్న ఈ ఇద్దరు స్త్రీల
యొక్క ఆరుగురు కుమారులు, ఒక పెద్ద గుర్రమును ఎక్కిన ఒక దివ్యపురుషుని చూచాడు. ఆ దివ్యపురుషుడు ఉదంకుని చూచి “ఉదంకా!
నీకు ఏమి వరం కావాలో కోరుకో!” అని అడిగాడు. వెంటనే ఉదంకుడు “ఈ నాగకులము మొత్తం నాకు వశవర్తులయి ఉండాలి.” అని అడిగాడు.
“అలాగయితే నువ్వు వచ్చి ఈ గుర్రం చెవిలో గట్టిగా ఊదు.” అని అన్నాడు ఆ దివ్యపురుషుడు. వెంటనే ఉదంకుడు పోయి ఆ గుర్రం చెవిలో గట్టిగా ఊదాడు. అప్పుడు ఆ గుర్రము శరీరంనుండి భయంకరమైన అగ్ని జ్వాలలు పుట్టి నాగలోకమును చుట్టుముట్టాయి.
నాగులంతా ప్రళయం వచ్చిందని భయపడ్డారు. నాగరాజు తల్లడిల్లి పోయాడు. వెంటనే తక్షకుడు గడగడా వణుకుతూ వచ్చి తాను అపహరించిన కుండలమును ఉదంకుడికి ఇచ్చాడు. అక్కడి నుండి బయటకు ఎలా వెళ్లాలా అని మధన పడుతున్న ఉదంకునితో ఆ దివ్యపురుషుడు ఇలా అన్నాడు. “ఉదంకా! నీవు ఈ గుర్రము ఎక్కి నీకు కోరిన చోటికి వెళ్లు” అన్నాడు. వెంటనే ఉదంకుడు ఆ గుర్రము ఎక్కి గురువుగారి ఆశ్రమమునకు వెళ్లాడు. గురుపత్నికి కుండలములు ఇచ్చాడు.
“ఉదంకా! పక్కనే ఉన్న పౌష్యమహారాజు దగ్గరనుండి కుండలములు తేవడానికి ఇంత ఆలస్యమా!” అని గురువుగారు ఉదంకుని అడిగారు.
ఉదంకుడు జరిగిన విషయాలు అన్ని గురువుగారికి చెప్పాడు.
“ఉదంకా! నీవు ధన్యుడవు. ఆ ఎద్దు నెక్కి వచ్చిన వాడు ఇంద్రుడు. ఆ ఎద్దు ఐరావతము. నీవు తిన్న గోమయము అమృతము. నీవు నాగ లోకములో చూచిన స్త్రీలు ధాత, విధాత. ఆ తెలుపు, నలుపు దారాల వస్త్రము రాత్రి పగలు, 12 ఆకులు గల చక్రము 12 మాసములు గల సంవత్సరకాలము. ఆరుగురు కుమారులు ఆరు ఋతువులు. ఆగుర్రము నెక్కి వచ్చిన దివ్య పురుషుడు
ఇంద్రుని మిత్రుడు పర్జన్యుడు. మొదట్లోనే నీవు ఇంద్రుడిని చూచి అమ్మ తపానము చెయ్యడం వల్ల నీవు కోరుకున్న పని నెరవేరింది. నీవు గురు పత్ని కోరిక నెరవేర్చడం వల్ల గురు దక్షిణ చెల్లించుకున్నావు. నీ విద్యాభ్యాసం పూర్తి
అయింది. నీకు కోరిన చోటికి వెళ్లే వచ్చును.” అని పలికాడు గురువు.
ఉదంకుడు గురువుకునమస్కరించి వెళ్లిపోయాడు. కాని ఉదంకుని మనసులో మాత్రము తక్షకుడు తనకు చేసిన అపకారము మరువలేక పోయాడు. తక్షకుని మీద పగ తీర్చుకోవాలని అనుకున్నాడు. వెంటనే జనమేజయ మహారాజు వద్దకు వెళ్లాడు.
“జనమేజయ మహారాజా! నీకు శుభము కలుగు గాక. నా పేరు ఉదంకుడు. నేను నా గురువు గారి కార్యము మీద పోయేటప్పుడు, కుటిల బుద్దితో ఏ మాత్రం వివేకం లేకుండా తక్షకుడు నాకు అపకారము చేసాడు. నన్ను మోసం చేసి గురుపత్ని కుండలములు అపహరించాడు. జనమేజయ మహారాజా! నాకే కాదు ఆ తక్షకుడు నీకూ మహాపకారము చేసాడు. మహావీరుడు అర్జునుని మనుమడు, అభిమన్యుని కుమారుడు అయిన నీ తండ్రి పరీక్షిత్తును దారుణంగా కాటువేసి చంపాడు. తన ఘోర మైన విషాగ్ని
కీలలకు నీ తండ్రిని బలిచేసాడు. ఒక విప్రుని కోరిక మేరకు నీ తండ్రిని
A
చంపాడు. తక్షకుడు మహా బలవంతుడు కదా. ఆ బ్రాహ్మణునికి ఇది తప్పు. పరీక్షిత్తు మహారాజును చంపడం భావ్యం కాదు అని నచ్చచెప్పవచ్చుకదా! కాని చెప్పలేదు. ఆ బ్రాహ్మణుడు చంపమనగానే వచ్చి, కాటు వేసి, నీ
తండ్రిని దారుణంగా చంపాడు.
Do
జనమేజయమహారాజా! నీ తండ్రిని చంపిన వాడి మీద ప్రతీకారం తీర్చుకో! వెంటనే సర్పయాగం చెయ్యి. ఆ తక్షకుడిని ఆ యాగాగ్నిలో భస్మం చెయ్యి. ఒక్క తక్షకునే కాదు. సమస్త నాగజాతినే భస్యం చెయ్యి. నీ తండ్రిని చంపిన తక్షకుని మీద పగ చల్లార్చుకో! మహారాజా! ఒక్కడు తప్పు చేస్తే ఆ కులమంతా తప్పు చేసినట్టే. ఇదేమీ కొత్త కాదు. కాబట్టి వెంటనే సర్పయాగము
చేసి తక్షకుని తో సహా సమస్త నాగ లోకమును యాగాగ్నిలో భస్మం చెయ్యి!” అని ఉదంకుడు జనమేజయుని రెచ్చగొట్టాడు.
ఈ కధ విన్న శౌనకాది మహామునులు సూతునితో ఇలా అన్నారు. “మహాత్మా! ఈ నాగకులమంతా యాగాగ్నిలో పడి భస్మం కావడానికి వేరు కారణం ఏమన్నా ఉందా!” అని అడిగారు.
” మహామునులారా మంచి ప్రశ్న వేసారు. పూర్వము సర్పకులమునకు తల్లి అయిన కద్రువ తన కుమారులకు ఇచ్చిన శాపం వలన, సర్పకులము అంతా జనమేజయుడు చేయబోయే సర్పయాగంలో పడి నశిస్తూ ఉంటే, పూర్వము భృగువంశము లో పుట్టిన రురుడు లోకములో ఉన్న పాములను
అన్నిటినీ నాశనం చేస్తుంటే దానిని సమస్రపాదుడు ఆపి నట్టు, సర్పయాగంలో నాశనం అవుతున్న సర్పకులము ఆస్తీకుని వలన రక్షింపబడుతుంది. ఆ వృ త్తాంతమును సవిస్తరముగా చెబుతాను వినండి.