పడి ఉండగా నిన్ను చంపడానికి రురుడు అనే భృగు వంశ సంజాతుడు వస్తాడు. అతనిని చూడగానే నీకు మామూలు రూపం వస్తుంది అని అన్నాడు. ఆ కారణం చేత నిన్ను చూడగానే నేను నా మామూలు రూపం పొందాను.
అది సరే! నీవు బ్రాహ్మణ వంశంలో పుట్టావు కదా! సర్వగుణ సంపన్నుడివి కదా! ఇది ఏమి పని? ఇలాంటి క్రూరమైన పనులు క్షత్రియులకు తప్ప
బ్రాహ్మణులకు ఉచితము కాదు కదా! ఎందుకంటే బ్రాహ్మణుడు అహింసాపరులు కదా! వారు హింస చేయరు. ఎదుటి వారు హింస చేస్తుంటే నివారించే కరుణామూర్తులు. జనమేజయుడు సర్పయాగము చేసి లోకములో ఉన్న పాములను అన్నింటినీ యాగాగ్నిలో భస్మం చేస్తుంటే నీ తండ్రిగారి శిష్యుడైన ఆస్తీకుడు కదా వారించాడు. నాగలోకమును రక్షించాడు. మరి నీవు ఇలా పాములను చంపడం భావ్యమా! ఈ సంహార కార్యక్రమం పమానలేవా!”అని అన్నాడు.
ఆ మాటలు విన్న రురుడు తన తప్పు తెలుసుకున్నాడు. పాములను చంపడం మానుకున్నాడు.
ఈ కధ విన్న శౌనకాది మహామునులు సూతునితో ఇలా అన్నారు. “ఎవరైనా తన బిడ్డలకు అపకారం చేస్తే తల్లి కాపాడుతుంది కదా. అటువంటిది కద్రువ తన కుమారులకు శాపం ఎలా ఇచ్చింది?” అని అడిగారు. దానికి సూతి ఇలా చెప్పసాగాడు.
మహాభారతము ఆదిపర్వము ప్రథమాశ్వాసము సంపూర్ణము.
Adiparvam-part1 Adiparvam-part1 Adiparvam-part1 Adiparvam-part1
Adiparvam-part1 Adiparvam-part1 Adiparvam-part1 Adiparvam-part1