వినత తనకు, కదు వ కు జరిగినదంతా చెప్పింది. పందెం విషం చెప్పింది.
“గరుడా నీ వల్ల నా దాస్యం తొలగి పోతుంది అని నీ అన్నయ్య అరుణుడు చెప్పాడు. అందువల్ల ఇప్పటి కా ఈ దాస్యాన్ని అనుభ విస్తున్నాను” అని చెప్పింది.
వెంటనే గరుడుడు కదు వ వద్ద కు, పాముల వద్దకు వెళ్లి ” మీకు ఏమి చేస్తే నా తల్లి దాస్య విముక్తి అవుతుంది” అని అడిగాడు.
అప్పుడు పాములన్ని గరుడుని చూచి “దేవ లోకం లో ఉన్న అమృత కలశం తెచ్చి మాకు ఇస్తే, నువ్వు, నీ తల్లి దాస్య విముక్తులవుతారు” అని చెప్పారు.
దానికి గరుడుడు అంగీకరించాడు. తల్లి వినత వద్దకు వెళ్లాడు. “అమ్మా అమ్మా దేవ లోకం నుండి అ ముతం తెచ్చి, నీకు దాస్య విముక్తి కలిగిస్తాను
అమ్మా. నన్ను అశీర్వదించ మ్మా” అన్నాడు.
వినత సంతోషంగా కొడుకును దీవించి పంపింది. గరుడుడు ఆకాశంలోకి ఎగిరాడు. దేవ లో కాని కి పోతూ దారిలో తండి అయిన కశ్యపుని కలిసాడు.
కశ్యపుని చూచి గరుడుడు “తండీ, నేను నా తల్లి దాస్యము నివృత్తి చేయుట కు అ మృత ము తెచ్చుటకు దేవలోక ము వెళ్లుచున్నాను. నాకు ఆకలి గా ఉన్నది. నాకు తగిన ఆహార ము కావలె ను” అని అడిగాడు.
కశ్యపుడు “కు మా రా, విభావసుడు, సుప్రతీ కుడు అని ఇరువురు అన్నద మ్ములు ఉన్నారు. తమ పిత్రార్జిత మైన ఆస్తిలో భాగ ము ఇవ్వ మని సుప్రతీకుడు తన అన్న గారైన విభావసుడిని అడిగాడు. దానికి అన్న విభావసుడు కోపించి తమ్ముడిని “ను వ్వు ఏనుగువు కమ్ము” అని శపించాడు. దానికి తమ్ముడు సుప్రతీకుడు కూడా కోపించి “నువ్వు తాబే లు వు కమ్ము” అని ప్రతి శాపం ఇచ్చాడు. అప్పుడు వారు ఇరువురు, మూడు యోజన ముల పొడవు, పదియోజన ముల వెడల్పు కల తాబేలు కానూ, ఆరు యోజన ముల పొడవు, పన్నెండు యోజన ముల వెడల్పుకల ఏనుగు గాను మారి పోయారు. కాని వారు ఇంకా ఆస్తి కోసం తగ వులాడు కుంటూనే ఉన్నారు. నీవు ఆ ఏనుగును, తాబే లును భక్షించి నీ ఆకలి తీర్చుకొను ము” అని చెప్పాడు కశ్యపుడు.
గరుడుడు సంతోషించి, ఆ ఏనుగు తాబే లు ఉండే చోటి కి వెళ్లి, వాటిని తన రెండు కాళ్ల తో పట్టు కొని ఆ కాశంలోకి ఎగిరి పోయాడు. మధ్య లో రోహణ ము అనే మహా వృక్షాన్ని చూచాడు.
అప్పుడు రోహణుడు గరుడుని చూచి “గ రుడా, నువ్వు నా కొమ్మ మీద కూర్చుని ఆ ఏనుగును, తాబేలు ను తిను ము” అని కోరాడు.
గరుడుడు అలాగే అని, ఒక పెద్ద కొమ్మ మీద వాలాడు. కాని ఆ ఏనుగు, తాబే లు, గరుడుని బరు వుకు తాళ లేక, ఆ కొమ్మ విరిగి పోయింది. గరుడుడు కంగారు పడ్డాడు. ఆ కొమ్మ భూమి మీద పడితే, ఆ కొమ్మకు తలకిందులు గా వేలాడుతూ తపస్సు చేసు కొనుచున్న వాల ఖిల్యులు అనే మునులు కింద పడి పోతారే మోనని భయపడి, ఆ కొమ్మను నోట కరుచు కొని మరల ఆకాశంలోకి ఎగిరాడు.
మరల తండ్రి అయిన కశ్యపుని వద్దకు వెళ్లాడు. గరుడుడు పడుతున్న అవస్త చూచి కశ్యపుడు, మహా మునులతో ” మహాత్ములారా, గరుడుడు ఒక కార్య ము నిమిత్త ము దేవలో కాని కి వెళుతున్నాడు. దయ చేసి మీరు ఈ కొమ్మను విడిచి పెట్టి, వేరే చోటికి వెళ్లి తపస్సు చేసుకోండి” అని ప్రార్ధించాడు.
దానికి ఆ మునులు సమ్మతించి, ఆ కొమ్మను పిడిచిపెట్టి హిమాలయాలకు వెళ్లారు. తరువాత గరు డుడు ఆ కొమ్మను ఎవరూ లేని చోట జార విడి చాడు. హిమాచలం మీద ఉన్న ఒక కొండ శిఖరం మీద కూర్చుని ఆ ఏనుగును, తాబేలును తిన్నాడు. వెంటనే దేవ లో కానికి వెళ్లాడు.
గరుడుడు దేవ లోకం స మీపిం చగనే, దేవేంద్ర సభ లో దుశ్శకునాలు గోచరించాయి. దేవ గురువు, బృహస్పతి, దేవేంద్రుడిని చూచి, “దేవేంద్రా, కశ్యపుని కు మారుడు గరుడుడు, తన తల్లి వినత దాస్య విముక్తి కొరకు, అమృతాన్ని అపహరించడానికి వస్తున్నాడు” అని చెప్పాడు. అప్పుడు దేవేంద్రుడు తన భటులతో “అ మృతాన్ని జాగ్రత్తగా కాపాడండి” అని ఆజ్నాపించాడు. గరుడుని కి అమృత రక్షకుల కు ఘోర యుద్ధం జరిగింది. గరుడుడు దేవతలను తన ముక్కుతోనూ, కాలి గోళ్ల తోనూ, రెక్కలతోనూ, గాయపరిచాడు. గరుడుని ధాటికి తట్టుకోలేక, అమృత
రక్షకులైన దేవతలు పారి పోయారు. గరుడుడు అమృతం ఉన్న చోటి కి చేరుకున్నాడు. అమృత కలశాన్ని తీసుకొని ఆ కాశంలోకి ఎగిరాడు.
అప్పుడు విష్ణువు గరుడుని వద్దకు వచ్చాడు. “గరుడా నీ శౌర్యానికి సాహసాని కి మెచ్చాను.నీకు ఏమివరం కావాలో కోరుకో!” అని అడిగాడు.