పాము కాటుతో మరణించబోయే పరీక్షిత్తును రక్షించడానికి ఆ కశ్యపుడు బయలు దేరాడు. తక్షకుడు కూడా శృంగి ఇచ్చిన శాపాన్ని అమలు చేసేందుకు బయలు దేరాడు. దారిలో తక్షకుడు కశ్యపుడిని కలుసుకున్నాడు.
“ముని పుంగ వా, త మరు ఎవరు? ఎక్కడ కు వెళుతున్నారు?” అని అడిగాడు తక్షకుడు.
“నా పేరు కశ్యపుడు. తక్షకుడు అనే సర్పము బారి నుండి పరీక్షిత్తును రక్షించి తగు బహు మానం పొందడానికి వెళుతున్నాను” అన్నాడు కశ్యపుడు.
దాని కి తక్షకుడు నవ్వి “నేనే ఆ తక్షకుడిని. పిడుగు పడ్డ వాడైనా బతక వచ్చు కాని, నేను కాటువేసిన వాడు బతకడం కష్టం. నీ మంత్రాలు, తంత్రాలు పనిచెయ్యవు. కాబట్టి తిరిగి వెళ్లి పో” అన్నాడు.
కశ్యపుడు ఒప్పుకోలేదు.
“అట్లా ఐతే, నేను ఈ మహావృక్షాన్ని నా విషంతో భస్మం చేస్తాను. నీకు చేతనైతే మరల బతికించు”
అన్నాడు. తక్షకుడి కాటు కు అంత పెద్ద వృక్షం కాస్తా బూడిద అయిపోయింది.
కశ్యపుడు ఆ బూడిద నంతా కుప్పగా చేసి, తన మంత శక్తి చేత, ఆ మహావృక్షాన్ని పూర్వము ఉన్న మాదిరి జీవింప చేసాడు. తక్షకుడు ఇది చూచి ఆశ్చర్య పోయాడు.
” మహాత్మా, శృంగి ఇచ్చిన శాపం తిరుగులేనిది. పరీక్షిత్తు బతకడు. కాబట్టి, ఆ మహా రాజు ఇచ్చే కాను కలకన్న ఎక్కువ కానుకలు నేను ఇస్తాను. తీసుకొని వెనక్కు వెళ్లండి” అని చెప్పాడు తక్షకుడు.
కశ్యపుడు జరగబోయేదానిని దివ్య దృష్టితో తెలుసుకొని, తక్షకుడు ఇచ్చిన కానుకలు తీసుకొని వెనక్కు వెళ్లాడు.
ఇదంతా ఎలా తెలిసిందంటే , ఆ చెట్టు బూడిద కాక ముందు, ఆ చెట్టు మీద ఒకడు కట్టెలు కొడుతూ ఉన్నాడు. చెట్టుతో కూడా వాడు కూడా భస్మం అయ్యాడు. కశ్యపుని మంత్ర శక్తి తో చెట్టు తిరిగి బతికి నప్పుడు వాడూ బతి కాడు. వాడు హస్తినా పురానికి వచ్చి జరిగిందంతా అందర కూ చెప్పాడు.
అలా కశ్యపుడు వెళ్లి పోయిన తరువాత, తక్షకుడు కొందరు సర్ప కు మారులను పిలిచాడు వారందరికి బాహ్మణ కు మారుల వేషం వేసాడు. అందరకు పూలు, పండ్లు ఇచ్చాడు. అందులో ఒక ఫలంలో తాను, ఒక నల్లని క్రి మిలాగ దాక్కున్నాడు. ఆ పళ్లను తీసుకు వెళ్లి జన మేజయుని కి ఇమ్మని సర్ప కు మారులకు చెప్పాడు.
తక్షకుడు చెప్పినట్టు, ఆ సర్పకు మా రులు, పూలు, పండ్లు తీసుకొని పరీక్షిత్తు మహా రాజు వద్దకు వెళ్లారు. ఆ బ్రాహ్మణ కు మారులను చూచి, పరీక్షిత్తు వారందరిని సాదరంగా ఆహ్వానించాడు. వారు ఇచ్చిన పళ్ల ను పూలను స్వీకరించాడు. కొన్నిఫలాలనూ క్కడ ఉన్న మంత్రుల కు ఇచ్చాడు.
తాను ఒక పండు తీసుకొని దానిని ఒలి చాడు. అందులో నల్లని క్రి మిలా గా దాక్కున్న తక్షకుడు బయటకు వచ్చాడు. ఆ నల్లని క్రిమి చూస్తూ ఉండగానే విషాగ్నులు చిమ్ముతూ పెద్దదిగా అయింది. తక్షకుడు పరీక్షిత్తును కాటు వేసాడు. ఇది చూచి అక్కడ ఉన్న మంతులు, సేవకులు పారి పోయారు. ఆ విష జ్వాలలకు పరీక్షిత్తు ఉన్న భవనం భస్మం అయింది. తరువాత బ్రాహణులు నీ తండ్రి కి కర్మకాండలు జరిపించారు.
కాని ఓ జన మేజయ మహారాజా! ఇది యుక్తము కాదు అని కూడా తలచకుండా, ఆ తక్షకుడు ఒక బ్రాహ్మణుడి ప్రేరణతో, నీ తండ్రి మరణానికి కారకుడు అయ్యాడు. కాబట్టి నువ్వు కూడా బ్రాహ్మణులను రాపించి, సర్ప యాగ ము చేసి, తక్షకుడితో సహా పాములను అన్నింటిని అంతం చెయ్యి ” అని మంత్రులు జన మే జయునకు వివరించారు.
ఇదంతా విని జన మేజయుడు మండి పడ్డాడు. తన తండి ని దారుణంగా చంపిన తక్షకుడి మీద ప్రతీకారం తీర్చుకోవాలనుకున్నాడు. రుత్విక్కుల ను పిలిచి సర్ప యాగం చేయదాని కి ఏర్పాట్లు చేసాడు. సర్ప యాగం చెయ్యా డానికి ఒక యాగ శాలను నిర్మించాడు. తన భార్య వపుష్ట మ తో యాగం చెయ్యడాని కి సిద్ధం అయ్యాడు.
ఇంతలో ఒక వాస్తు విద్యా నిపుణుడు జన మే జయునితో ఇలా పలి కాడు.
“ఓ జన మేజయ మహారాజా, సర్పయాగం చెయ్యాలి అనే నీ సంకల్పం మంచిదే కాని ఈ యజ్నం పూర్తి కాదు.
మధ్యలో ఆగి పోతుంది” అని చెప్పాడు.
కాని ఆ మాటలు జన మేజయ మహారాజు వినలేదు. వ్యాసుడు, వైశంపాయనుడు మొదలైన మహా మునుల సమక్షంలో యాగం చెయ్య తలపెట్టాడు. సర్ప యాగం మొదలు అయింది. రుత్విక్కులు మంత్రాలు పలుకుతూ పాములన్నిటి ని పిలుస్తున్నారు. అప్పుడు పాములన్నీ వచ్చి వో మ గుండంలో పడి భస్మం అవుతున్నాయి. ఇదంతా చూచి తక్షడు భయంతో తల్లడిల్లి పోయాడు.
ఇంద్రుడి వద్దకు వెళ్లి “దేవేంద్రా నన్ను కాపాడు” అని అడిగాడు. ఇంద్రుడికి బ్రహ్మ గారు కొన్ని పాముల కు అభయం ఇచ్చిన విషయం తెలుసు. అందుకే “తక్షకా సీకేం భయం లేదు” అని చెప్పాడు.