కొడుతూ ఉంది. ఆకు దొప్ప లోనుండి జారిన వసువు వీర్యము, సరా సరి ఈ అప్సర స నోట్లో పడింది. అద్రిక గర్భం దాల్చింది.
ఒక రోజు జాలరలు వేసిన వలలో ఈ అదిక | పడింది. జాలర్లు చేప రూపంలో ఉన్న అది కను కోసారు. అందులో నుండి, ఒక ఆడ బిడ్డ ఒక మగ బిడ్డను చూచారు. వెంటనే అది క అప్సరస గా మారి దేవలోకం వెళ్లి పోయింది.
ఆ బిడ్డలను జాలర్లు తమ రాజైన దాశరాజు కు ఇచ్చారు. ఆ పిల్లలు పెరిగి పెద్ద వాళ్లు అయ్యారు. మగ బిడ్డ మత్స్య దేశానికి రాజయ్యాడు. ఆడపిల్ల మత్య గంధి అనే పేరుతొ దాశ రాజు ఇంటిలో పెరుగుతూ ఉంది. తండ్రి లేనపుడు యమునా నదిలో పడవ నడుపుతూ ఉంది.
ఒక రోజు వశిష్ట మహా మునికి మను మడు, శక్తి మహాముని కొడుకు అయిన పరాశర మహా ముని య మునా నదిని దాటడానికి వచ్చాడు. పడవలో ఉన్న మత్సగంధిని చూచాడు. ఆ మెను మోహించాడు. తనతో సంపర్కం జర ప వలసిందిగా కోరాడు. ఆ మె భయపడింది. కాదు అంటే శాపం పెడతాడేమో అని వణి కి పోయింది.
” మహాత్మా, నేను కన్యను.
జాలరి పుత్రికను. ఒల్లంతా చేపల వాసన. మీరు తట్టు కోలేరు. నేను నా కన్యాత్వ మును పోగొట్టు కొనిన, మరల నా తండ్రి మొహము ఎలా చూడగలను.” అని చెప్పింది. –
అప్పుడు పరాశరుడు “బాలా, నీవు జాలరి పుత్రిక వు కావు. వసురాజు వీర్యమున కు జన్మించిన దాన వు. నీ కన్యాత్వము చెడకుండా నీతో సంగమించెదను.” అని తన మహిమతో ఆమె ఒళ్లంతాఒక యోజన దూరం సు గంధాలు వెదజల్లేట్టు చేసాడు. అప్పటి నుండి ఆ మె యోజన గంధి అయింది“.
” మహాత్మా ఇది పట్ట పగలు. మనం సంపర్కం జరిపితే అందరూ చూస్తారు” అని మరో సాకు చెప్పి తప్పించు కోబోయింది. దానికి పరా శరుడు, ఆకాశంలో మేఘాల ను ఆవ రిం పచేసి, లోక మంతా చీ కటి చేసాడు. ఇంక ఆమె చేసేది లేక పరాశరుడితో సంపర్కానికి ఒప్పుకుంది.
తత్ఫలితంగా ఆ సత్యవతి కి వ్యాసుడు జన్మించాడు.
పుట్టిన వెంటనే వ్యాసుడు తల్లి కి నమస్కరించి “అమ్మా నేను తపస్సు చేసుకోడానికి వెళుతున్నాను. నీకు అవసరం వచ్చినప్పుడు నన్ను తల్చుకో. నేను నీ వద్దకు వస్తాను” అని చెప్పి వెళ్లి పోయాడు. ఆ వ్యాసుడే, వేదాలను విభజించాడు. మహా భారత కధను రచించాడు.
తరు వాత, దేవ దానవ అంశలతో, భీష్ముడు మొదలైన కురు రాజులు పుట్టారు అని వెశం పాయనుడు జన మేజయు న కు చెప్పగా, జన మేజయుడు ” మహాత్మా, దేవతల అంశలతో పుట్టిన వాళ్లు ఇలా రాజ్యం కోసం యుద్ధం చేసు కోడం ఏమిటి ” అని అడిగాడు.
దానికి వైశంపాయనుడు ఇలా చెప్ప సాగాడు. జన మేజయా, పరశురాముడు ఇరవై ఒక్క సార్లు క్షత్రియుల మీద యుద్ధం చేసి, లోకంలో ఉన్న క్షత్రియులంద రినీ చంపేసాడు. అప్పుడు వారి భార్యలందరూ, సంతాన ము కావాలె ను అనే
కోరికతో, అప్పటి ధర్మం ప్రకారం, ఉత్త మమైన బ్రాహ్మణుల అనుగ్రహంతో , పుత్ర సంతానాన్ని పొందారు.
మరల రాజ వంశాలు వృద్ధి చెందాయి. రాజులు ధర్మం తప్పకుండా పరి పాలించారు.
సకాలంలో వానలు కురిశాయి. పంటలు వ్రుద్ధి చెందాయి. ప్రజ ఆయుర్దాయం పెరిగింది. మరణాలు తక్కువ అయ్యాయి. భూ భారం ఎక్కువ అయింది.
భూదేవి బ్రహ్మ విష్ణు మహేశ్వరుల వద్దకు వెళ్లి భూ భారాన్ని తగ్గించ మని వేడుకుంది. అప్పుడు దేవతల అంశలతో పాండవులు, ఇతర రాజులు జన్మించారు. రాక్షసుల అంశలతో శిశుపాలుడు, దుర్యోధనుడు మొదలైన వారు జన్మించారు. వీరి వలన మహాభారత యుద్ధం జరిగింది. 15 అక్షౌహిణీల మంది చనిపోయారు. భూభారం తగ్గి పోయింది అని వివరించాడు వైశంపాయనుడు.
అప్పుడు జన మేజయు డు, మహాత్మా, దేవ దాన వులు ఈ భూమి మీద ఎలా జన్మించారో వివరంగా తెలపండి అని అడిగాడు. దానికి వైశంపాయనుడు ఇలా చెప్ప సాగాడు.
జన మేజయా, ఈ సృష్టికి మూలం బ్రహ్మ దేవుడు. ఆయన కు ఆరుగురు మాన సపుత్రులు. వారు మరీచి, అంగీరసుడు, అత్రి, పులస్త్యుడు, పులహుడు, క్రతువు.
(1) మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మ దేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమ చేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరు వురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు.
దక్షుని కి యా భై మంది కుమార్తె లు జన్మించారు. అందులో పద మూడు మంది ని కశ్యపున కు ఇచ్చాడు. వారిలో దితి అనే ఆమెకు హిరణ్యకశిపుడు జన్మించాడు. హిరణ్యకశిపుని కు మారుడు ప్రహ్లాదుడు. ప్రహ్లాదునికి ముగ్గురు కొడుకులు. అందులో విరోచ నుడి కి బలి జన్మించాడు. బలి కొడుకు బాణాసురుడు. దను అనే స్త్రీ కి 40 మంది దానవులు కలిగారు. అలా దాన వ సంతతి పుట్టింది. (ఇక్కడ మన కు అవసరమైనంత వరకే రాస్తున్నాను. మిగిలినవి వదిలేస్తున్నాను).