జన మేజయ మహారాజా, వృషపర్వుడు అనే రాక్షస రాజు ఉన్నాడు. ఆయన కు గురువు శుక్రాచార్యుడు. శుక్రాచార్యుని కు మార్తె దేవయాని.
వృషపర్వుని కు మార్తె శర్మిష్ట.
దేవతలకు గురువు బృహస్పతి. బృహస్పతి కు మారుడు కచుడు. శుకా చార్యుని కి మృత సంజీవని విద్య తెలుసు. ఆ విద్యతో దేవాసుర యుద్ధంలో, చనిపోయిన రాక్షసులందరిని తిరిగి బతికిస్తున్నాడు శుక్రాచార్యుడు. దానితో రాక్షసుల బలం పెరిగి పోతూ ఉంది.
దేవతలందరూ కచుని వద్ద కు వెళ్లారు.
“ఓ కచుడా, మృత సంజీవని వలన, మనం ఎంత మందిని చంపినా, రాక్షసుల బలం తగ్గ కుండా ఉంది. అందు వలన నువ్వు శుక్రాచార్యుని వద్దకు వెళ్లి ఆ మృత సంజీవని విద్యను తెలుసుకొని రావాలి. దానికి ఒకే మార్గం ఉంది. శుక్రాచార్యునకు
తన కుమార్తె దేవయాని అంటే ఎంతో ప్రేమ. ఆమె కోసం ఏమైనా చేస్తాడు. నువ్వును ముందు ఆ మె
అభిమానాన్ని పొంది, దాని ద్వారా ఆ మృత సంజీవని విద్యను శుకుని వల్ల గ హించాలి” అని చెప్పారు.
దానికి కచుడు సరే అన్నాడు. దేవతల కోరిక | మేరకు శుక్రుని వద్దకు వెళ్లాడు. శుక్రాచార్యుడిని చూచిన మస్కరించాడు.
“మహాత్మా, నేను దేవ గురువు బృహస్పతి పుత్రుడను. నా పేరు కచుడు అంటారు. నేను త మ వద్ద విద్య అభ్యసింప వచ్చాను” అన్నాడు. దాని కి శుకుడు సంతోషించాడు. తన శిష్యుడు గా చేర్చుకున్నాడు. ఇది మిగిలిన రాక్షసులకు నచ్చలేదు. వారు ఎలాగైనా కచునికి అపకారం తల పెట్టాలని నిశ్చయిం చారు. కచుడు మాత్రం గురువు గారు చెప్పిన పనులన్ని చేస్తున్నాడు. ముఖ్యంగా దేవయాని చెప్పిన పనులను శ ద్ద గాచేస్తూ ఆ మె ప్రేమను పొందుతున్నాడు.
ఒక రోజు, కచుడు మిగిలిన రాక్షస శిష్యులు అడవికి వెళ్లారు. ఇదే అదనుగా భావించి , ఆ రాక్షసులు కచుడిని చంపి, ఆ శవాన్ని ఒక చెట్టుకు కట్టేసారు. తరు వాత ఆశ మానికి వెళ్లారు. ఎంత రాత్రి అయినా కచుడు రాలేదు. దేవయాని కి కంగారు ఎక్కువ అయింది.
తండ్రి వద్దకు వెళ్లి “తండ్రీ, రాత్రి చాలా పొద్దు పోయింది. అందరూ వచ్చారు కాని కచుడు రాలేదు. అతని కి ఏమన్నా ఆపద కలిగిందేమో అని నాకు భయంగా ఉంది.” అని చెప్పింది.
శుక్రుడు తన దివ్య దృష్టి తో చూచాడు. కచుడు చని పోయాడని తెలిసింది. వెంటనే శుకుడు, దేవయాని కచుడు చచ్చిపడి ఉన్న చోటికి వెళ్లారు. శుకుడు తన మృత సంజీవని విద్యతో కచుడిని బతికించాడు. దేవయాని సంతోషించింది. కచునితో ఆశ మానికి వచ్చారు.
కొన్ని రోజుల తరువాత, ఒక రోజు కచుడు, మిగిలిన రాక్షసులు పూలు తెచ్చేందుకు అడవికి వెళ్లారు. అక్కడ రాక్షసులందరూ కలిసి కచుడిని చంపేసారు. అతని శవాన్ని కాల్చి బూడిద చేసారు. ది ఆ బూడిదను మద్యంలో కలిపారు. ఆ మద్యాన్ని గురువు గారు శుకుడికి ఇచ్చారు. ఇది తెలియక , శుకుడు ఆ మద్యాన్ని సేవించాడు.
రాత్రి పొద్దు పోయింది. కచుడు రాలేదు. మరల రాక్షసులు చంపే సారే మో అని దేవయాని కి అను మానం కలిగింది. తండి వద్దకు వెళ్లి ఏడుస్తూ ఉంది. అప్పటి కే శుక్రుడు మద్యం మత్తులో ఉన్నాడు.
“పోనీలే మ్మా, బతికి ఉంటే వస్తాడు. చస్తే ఉత్త మ లో కాల కు పోతాడు. ఎందుకు ఏడుస్తావు” అన్నాడు.
దాని కి దేవయాని “తండీ , అంగీరసుని మను మడు, బృహస్పతి పుత్రుడు అయిన కచుడు రాక్షసులచేత చస్తే ఏడవకుండా ఎలా ఉండ మంటావు. కచుడు ఇంటి కి వస్తే గాని నేను ఆహారం, నీళ్లు
ముట్ట ను” అని ఏడుస్తూ కూర్చుంది.
కూతురి ఏడుపు చూచి శుకుడు చలించి పోయాడు. తన దివ్యదృష్టితో చూచాడు. కచుడు ఎక్కడా కనపడలేదు. చూడ గా, చూడగా, బూడిద రూపంలో, మద్యంతో కలిసి తన కడుపులో ఉన్న కచుడిని చూచాడు.
అప్పుడు తెలిసింది రాక్షసులు కచుడిని చంపి, బూడిద చేసి, మద్యంలో కలిపి తనతో తాగించారని. చాలా బాధ పడ్డాడు.
“అహా! మద్యంఎన్ని అనర్ధాలు కలిగిస్తుంది. అందు వల్ల నేటి నుండీ బ్రాహ్మణులు గాని, ఇత రులు గాని మద్యపానం చేస్తే, వారికి పాపం చుట్టు కుంటుంది. నర కాని కి పోతారు” అని శాపం పెట్టాడు .
(ఈ రోజుల్లో కూడా మద్య పానం వల్ల ఎన్నో కుటుంబాలు సర్వ నాశనం అవుతున్నాయి. ఎన్నో నేరాలు మద్యపానం మత్తులోనే జరుగుతున్నాయి. ఆనాటి శుక్రాచార్యుల వారికి ఉన్న జ్నానం ఈనాటి ప్రభుత్వాలకు లేదు. మద్యపానం నిషేధించరు. ఇది చదివిన వారిలో ఎవరికన్న మద్యపానం అల వాటు ఉంటే , వారందరూ, మద్యపానాన్ని మాని, వారికి, వారి కుటుంబాలకు మేలు చేసుకుంటారని నా కోరిక).
వెంటనే, తన మృత సంజీవని విద్యతో తన పొట్ట లో ఉన్న కచుడి నిబతి కించాడు. అప్పుడు పొట్టలోనుండి కచుడు ” మహాత్మా, మీదయవలన నేను బతి కాను. కాని నేను ఎలా బయటకు రావాలి ” అని అడిగాడు.