ఇంతలో దే వయాని పరిచారిక ఘార్లిక అను పేరు కలది దేవయానిని వెద కుచూ అక్కడకు వచ్చింది.
దే వయాని పరిచారిక ను చూచి “నేను వృషపర్వుడి నగరానికి రాను. నువ్వు వెళ్లి నా తండి తో నాకు శర్మిష్ట చే సిన అవమానము తెలుపు ము” అని చెప్పి పంపింది. ఈ విషయం తెలిసి శుకుడు వెంటనే దే వయాని ఉన్న చోటు కు వచ్చాడు.
“అమ్మా దేవయాని, నీకు కోపం తగదమ్మా. ఎన్నో యగ్నాలు,యాగాలు చేసిన వారి కంటె , కోపము లేని వాడే గొప్పవాడ మ్మా. ఇతరులు మన మీద కోపించినా, అవమానించి నా, దానిని మనసులో పెట్టుకోకుండా స్నేహం గా ఉండట మే పర మ ధర్మం అమ్మా. కాబట్టి కోపం బుద్ధి మంతుల కు తగదు. శర్మిష్ట నీ కంటే వయసులో చిన్నది. దానితో నీకే మిటి . ఇంటి కి పోదాము రా అమ్మా” అన్నాడు శుక్రుడు.
(ఇక్కడ శుకుడు మంచి వారికి కోపం తగదు అని చెప్పాడు.
కోపములేని వాడే గొప్ప వాడు అని నొక్కి చెప్పాడు. మహా రుషి శ మీకుడు కూడా, తన కొడుకు శృంగితో కోపము సర్వ అనర్ధాలకు మూలము అంటాడు. అలాగే భగవద్గీతలో కూడా “క్రోధాద్భవతి సమ్మోహః సమ్మోవత్ స్మృతి విభ్ర మః స్మృతి భ్రంశాద్బుద్ధి నాశో బుద్ధినాశాత్ ప్రణశ్యతి.” అన గా కోపం వలన ఆవేశం పుడుతుంది, ఆవేశం, వస్తే తన్ను తాను మరిచి పోతాడు. మంచి చెడు వివేకం నశిస్తుంది. ఈ స్తితిలో అనరాని మాటలు అంటాడు చెయ్యరాని పనులు చేస్తాడు. దాని ఫలితంగా మనుష్యుడు చెడి పోతాడు.
కాబట్టి, కోపము సర్వ అనర్ధాలకు మూలము అని, శాంత మే సౌఖ్యదాయక మనీ ఆ నాడే శమీక
మహర్షి, శుక్రుడు, శ్రీ కృష్ణుడు చెప్పారు. మన కాలంలో కూడా, “శాంత ము లేక సౌఖ్య ము లేదు” అని త్యాగ రాజు తన కృతుల్లో వినిపించాడు. కాబట్టి మనం కోపం తగ్గించు కొని, వీలుంటే పూర్తిగా | మాని వేసి, శాంతంగా బత కాలని కోరుకుందాము. ఇదే విషయం మన పిల్లలకు కూడా చెపుదాము).
శుకుడు ఎంత చెప్పినా దానికి దేవయాని ఒప్పుకోలేదు.“నాకు అవ మానం జరిగిన చోట నేను ఉండను. వేరే ఎక్కడి కన్నా వెళతాను” అని తండ్రి అయిన శుక్రుడితో చెప్పింది.
“అమ్మ నువ్వులే కుండా నేను కూడా ఈ నగరంలో ఉండలేను నేను కూడా నీ వెంటనే ఉంటాను” అన్నాడు శుక్రుడు.
ఇంత లో ఈ విషయాలన్ని తెలుసుకున్న వృషపర్వుడు వెంటనే శుక్రాచార్యులు, దేవయాని, దగ్గరకు వచ్చాడు.
“గురుదేవా నీ దయచేతనే కదా మా రాక్షస జాతి అంతా బతుకుతున్నది. లేక పోతే మేము అందరం మరణించ వలసిన వార మే కదా. అందుకని ఈ రాజ్య ము, ఈ సంపదలు మీవి. మీకు ఏమి కావాలో అడగండి.” అని ప్రాధేయపడ్డాడు.
శుకుడు దేవయాని మొహం చూచాడు. దేవయాని వృషపర్వునితో “నీ కూతురు శర్మిష్ట, ఆమె వెయ్యి మంది పరిచారికలు ఈ రోజు నుండి నాకు పరిచారి కలు గా ఉండాలి ” అని చెప్పింది. వృషపర్వుడు దానికి ఒప్పుకున్నాడు. వెంటనే తన కూతురు శర్మిష్టను, ఆమె వెయ్యి మంది పరిచారి కలను దేవయాని కి పరిచార కులు గా నియ మించాడు. అప్పటి నుండి చక్రవర్తి కుమార్తె శర్మిష్ట, శుకుని కూతురైన దేవయానిని సేవిస్తూ ఉంది.
ఒక రోజు దేవయాని, శర్మిష్ట తోనూ, మిగిలిన పరిచారికలతో, అదే వనాని కి విహారానికి వెళ్లింది. మరల యయాతి మహారాజు అదే వనానికి వేట కు వచ్చాడు. వీరందరిని చూచాడు. దేవయానిని చూచి “బాలా, ఇది వరకు నేను నిన్ను చూచి నాను.
వీరందరూ ఎవరు?” అని అడిగాడు.
దానికి దేవయాని, ” మహారాజా, నేనెవరో మీకు తెలియును. ఈ మె పేరు శర్మిష్ట, వృషపర్వ చక్రవర్తి కు మార్తె, నా దాసి. ఎప్పుడూ నన్ను సేవిస్తూ ఉంటుంది. మిగిలిన వారందరూ నా పరిచారికలు. రాజా, నేను నూతిలో పడ్డప్పుడు నువ్వు నీ చేతిని నాకు అందించి, నన్ను బయటకు లాగావు. అప్పుడే మన కు పాణి గ్రహణ మైనది. అందుకని నీవు నన్ను వివాహ మాడు ము. ఈ శర్మిష్టతో సహా వెయ్యి మంది పరిచారికలతో నిన్ను సేవిస్తూ ఉంటా ము” అని చెప్పింది.
. దానికి యయాతి, “బాలా, ఇది ధర్మము కాదు. బ్రాహ్మణులు క్షత్రియ కన్యను వివాహమాడ వచ్చు కాని, క్షత్రియుడు బాహణ కన్యను వివాహ మాడ రాదు. ఇది ధర్మ విరుద్ధ ము. రాజునైన నేనే అధర్మము చేసిన మిగిలిన వారు కూడా ధర్మము తప్పరా. అందుకని ఈ వివాహము జరగదు” అని అన్నాడు.
“యయాతి మహా రాజా, నా తండ్రి శుక్రాచార్యుడు, లోకానికి ధర్మా ధర్మ నిర్ణయం చేసేవాడు.ఆయన చెపితే ఒప్పుకుంటారా” అని దేవయాని అడిగింది.
దానికి యయాతి “ఆ మహానుభావుడు వచ్చిఇది ధర్మ విరుద్ధము కాదు అని చెప్పిన నేను నిన్ను తప్పక వివాహ మాడెదను” అని అన్నాడు.